నవంబర్ నెల మొత్తం నందమూరి నటసింహ బాలకృష్ణ సందడి చెయ్యబోతున్నారు. ఓ వైపు అఖండ తాండవడం ప్రమోషన్స్. డిసెంబర్ 5 న విడుదల కాబోతున్న అఖండ తాండవం ప్రమోషన్స్ పాన్ ఇండియా వేదికగా మొదలు కాబోతున్నాయి. ఈ చిత్రం తో బాలయ్య మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసేందుకు బోయపాటి ప్లాన్ చేసారు.
సో ముంబై నుంచి చెన్నై వరకు, బెంగుళూరు నుంచి హైదరాబాద్ వరకు నందమూరి బాలకృష్ణ అఖండ 2 ని ప్రమోట్ చేస్తూ ఈనెల మొత్తం మీడియాలోనే కనిపిస్తారు అని అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. మరో వైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చెయ్యబోయే NBK 111 మూవీ అప్ డేట్స్ స్టార్ట్ అయ్యాయి.
ఈ చిత్రంలో బాలయ్య తో నటించబోయే హీరోయిన్ ని రివీల్ చెయ్యబోతున్నారు. అనివార్య కారణాల వలన అది పోస్ట్ పోన్ అయ్యింది. ఇక బాలకృష్ణ-గోపీచంద్ కాంబో NBK111 మూవీ ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది అనే టాక్ ఉంది. అటు అఖండ తాండవం, ఇటు NBK 111 అప్ డేట్స్ తో ఈ నెలలో బాలయ్య సందడి మాములుగా ఉండదు అని అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు.