ప్రతి నెలలో క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆడియన్స్ కూడా ప్రతి వారం విడుదలయ్యే సినిమాలపై హోప్స్ పెట్టుకున్నారు. అందులో కొన్ని సినిమాలు ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంటే మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేస్తున్నాయి. దసరా, దీపావళి ఫెస్టివల్ ని క్యాష్ చేసుకుందామనుకున్న చిత్రాల్లో కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి.
అక్టోబర్ ఫస్ట్ వీక్ లో రెండు డబ్బింగ్ చిత్రాలు వచ్చాయి. ధనుష్ ఇడ్లి కొట్టు, కన్నడ నుంచి కాంతార చాప్టర్ 1 విడుదలయ్యాయి. అందులో కాంతారా 1 హిట్ గా నిలిచింది.
అక్టోబర్ సెకండ్ వీక్ లో చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. అందులో అరి, కానిస్టేబుల్, మటన్ షాప్, శశివదనే రిలీజ్ అవ్వగా అరి ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. స్టార్ క్యాస్ట్ ఆడియన్స్ ను థియేటర్స్ కి వెళ్లేలా చేసింది. ఇక మిగతా కానిస్టేబుల్, మటన్ సూప్, శశివదనే చిత్రాలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.
అక్టోబర్ థర్డ్ వీక్ లో క్రేజీ గా దీపావళికి పోటీపడ్డారు యంగ్ హీరోలు. అందులో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్ డబ్బింగ్ చిత్రం, K-ర్యాంప్ ఉన్నాయి. మిత్రమండలి, తెలుసు కదా థియేటర్స్ నుంచి మాయమైపోగా.. డ్యూడ్, K-ర్యాంప్ ఆడియన్స్ ను ఆకట్టుకుని దీపావళి విన్నర్స్ గా నిలిచాయి. అదేవారంలో రష్మిక థామా వచ్చింది వెళ్ళింది.
అక్టోబర్ ఫోర్త్ వీక్ లో బాహుబలి: ది ఎపిక్ రీరిలీజ్, రవితేజ మాస్ జాతర సినిమాలతో అక్టోబర్ సినిమాల సందడి ముగిసింది. మాస్ జాతర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కాగా.. బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ వీకెండ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టింది. సో అక్టోబర్ ఇలా ఉంటే.. ఈ నవంబర్ పరిస్థితి ఏమిటో చూడాలి.