బిగ్ బాస్ సీజన్ 9 లోకి సీరియల్ నటి, కన్నడ అమ్మాయి తనూజ అడుగుపెట్టినప్పటినుంచి ఆమెను బుల్లితెర ప్రేక్షకులు అభిమానిస్తున్నారు. తనూజ అందంతోనే కాదు స్టాండ్ తీసుకోవడంలోనూ అన్నిటిలో ఆమె తన మార్క్ చూపిస్తున్నా టాస్క్ ల విషయం లో కాస్త వీక్ గా కనిపిస్తుంది. తనవరకు తను బెస్ట్ ఇస్తుంది. కానీ విన్ అవ్వడం లేదు.
మరోపక్క ఆమె తప్పు చేసినా బిగ్ బాస్ తనూజ ని ఏమి అనకుండా ఆమెను కన్ఫెషన్ రూమ్ కి తీసుకెళ్లి మరీ ఆమెకు మంచి చెప్పడం హౌస్ మేట్స్ కే కాదు బయట ఆడియన్స్ లో కొంతమందికి తనూజ పై నెగిటివిటి స్టార్ట్ అయ్యింది. మరోపక్క వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ తనూజ ను టార్గెట్ చేస్తూ హౌస్ లోకి అడుగుపెట్టారు. అయేషా, రమ్య లు డైరెక్ట్ గానే తనూజని కళ్యాణ్ విషయంలో టార్గెట్ చేసారు.
కళ్యాణ్ తో తనూజ క్లోజ్ గా ఉండడంపై ఆమెపై హౌస్ మేట్స్ లో నెగిటివ్ స్టార్ట్ అయ్యింది. భరణి బాండింగ్ ఆమెకు మైనస్ అయ్యింది, ఇమ్మాన్యువల్ తో ఫ్రెండ్ అయ్యింది. అటు హౌస్ మేట్స్, ఇటు ఎలిమినేట్ అయిన శ్రీజ లాంటి వాళ్ళు టార్గెట్ తనూజ అన్న రేంజ్ లో ఆమెను ప్రతి దానిలో పాయింట్ అవుట్ చేస్తున్నారు.
బిగ్ బాస్ అలాగే నాగార్జున కు తనూజ ముద్దుబిడ్డ అంటూ సెటేరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై తనూజ విషయంలో బిగ్ బాస్ కూడా స్ట్రిట్ గా ఉంటాడేమో చూడాలి.