ద రాజా సాబ్ జనవరి 9 నుంచి మరోసారి పోస్ట్ పోన్ అవ్వబోతుంది, రాజా సాబ్ పై ఒత్తిడి కత్తి, మారుతిపై రాజా సాబ్ ప్రమోషన్స్ టెన్షన్ అంటూ ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజా సాబ్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యలేదు, ఫస్ట్ సింగిల్ కే గతి లేదు, ఇక సినిమా రిలీజ్ ఎప్పుడు అంటూ కామెడీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఎన్నోసార్లు రిలీజ్ తేదీ వాయిదా వేసుకున్న రాజా సాబ్ పై మళ్లీ ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అయితే నెగటివ్ రావడం ఖాయం. అందుకే ప్రొడ్యూసర్స్ రాజా సాబ్ పోస్ట్ పోన్ వార్తలను ఖండిస్తూ ప్రెస్ నోట్ వదిలారు. రాజా సాబ్ ఖచ్చితంగా జనవరి 9 కే వస్తుంది. డిసెంబర్ 25 కల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది.
అంతేకాదు అమెరికా లో ప్రభాస్ రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా రాజ్ సాబ్ ప్రొడ్యూసర్ చెప్పేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. లేదంటే రాజా సాబ్ పోస్ట్ పోన్ వార్తల విషయంలో మరోసారి వారు టెన్షన్ మోడ్ లోకి వెళ్లారు.