తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి మైనస్ ఏమిటి అంటే అందులోని ప్రతి ఒక్క నేత సీఎం కుర్చీపై కన్నెస్తారు. దాని కోసం గొడవలు పడతారు, బయట ప్రతిపక్షాలకు పలచన అవుతారు. దానితో పాటుగా కాంగ్రెస్ కి మెయిన్ మైనస్ పాయింట్ ఏమిటి అంటే.. సోషల్ మీడియా. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కి పట్టు లేదు.
అదే బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. బీఆర్ఎస్ వాళ్ళు కదిలినా మెదిలినా ట్వీట్లు పడిపోతాయి. బీఆర్ఎస్ నేతలెవరైనా ప్రజలతో కలిసినా, లేదంటే కాంగ్రెస్, బిజెపి లపై నెగెటివ్ గా ప్రచారం చెయ్యాలన్నా బీఆర్ఎస్ సోషల్ మీడియా అడుగడుగునా పని చేస్తుంది.
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్ట్మాకంగా పోరాడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గోపినాధ్ భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ లు పోటీపడుతున్నారు. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అలిగేషన్స్ వేస్తున్నారు. కానీ అది జనాలకు రీచ్ అవ్వడం లేదు. అదే కేటీఆర్ మాట్లాడే మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ప్రజలు కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నారు అంటూ బిట్లు బిట్లు గా వీడియోస్ వదులుతున్నారు. దానిని డిపెండ్ చేసుకోవడానికి కాంగ్రెస్ కి అంత స్ట్రాంగ్ అయిన సోషల్ మీడియా లేదు అనేది వాస్తవం. మరి రేవంతన్న సోషల్ మీడియా పై కాస్త ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు.