జాతీయ అవార్డులపై జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జాతీయ అవార్డులకు మమ్ముట్టి(మమ్ముక్క)ని వరించే అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికైన మమ్ముట్టి అసాధారణ ప్రతిభ, పనితీరును హైలైట్ చేస్తూ మాట్లాడిన అవార్డుల కమిటీ జూరీ సభ్యుడు ప్రకాష్ రాజ్ జాతీయ అవార్డుల జూరీ పనితీరు, విధి విధానాలపై విరుచుకుపడ్డారు.
కేరళ రాష్ట్ర అవార్డులను ప్రకటించిన అనంతరం మీడియాతో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ జాతీయ అవార్డులపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... జాతీయ చలనచిత్ర అవార్డులు రాజీ పడ్డాయని చెప్పడానికి నాకు అభ్యంతరం లేదు... కేరళ జ్యూరీ ఛైర్మన్‌గా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు నన్ను పిలిచినప్పుడు, మాకు అనుభవజ్ఞుడైన బయటి వ్యక్తి అవసరమని, అవార్డుల ప్రక్రియలో మా చేతులు పెట్టము.. మిమ్మల్ని స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి అనుమతిస్తామని చెప్పారు`` అని తెలిపారు. జాతీయ అవార్డులలో అలా జరగడం లేదని ఇతరుల ప్రమేయం ఉంటుందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. అలాంటి జ్యూరీ.. అలాంటి జాతీయ ప్రభుత్వం ఉన్నప్పుడు... వారు మమ్ముక్కకు అవార్డు ఇచ్చేందుకు అర్హులు కారు`` అని విమర్శించారు.
55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల విజేతలను ఇటీవల ప్రకటించారు. మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం పలు విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. జూరీ మెంబర్ ప్రకాష్ రాజ్ ని మీడియా ప్రశ్నించగా, అతడు జాతీయ అవార్డులపై తన అసంతృప్తిని వెల్లగక్కారు. అక్కడ విధివిధానాలపై ఆయన అసహనం వ్యక్తపరిచారు.
మత్తిలుకల్, ఒరు వడక్కన్ వీరగాథ, పొంతన్ మాడ, విధేయన్ అండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రాలలో తన నటనకు మమ్ముట్టి గతంలో మూడుసార్లు ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఏళ్లుగా మమ్ముట్టి గొప్ప ప్రదర్శనలు ఇచ్చినా కానీ జ్యూరీ అతడిని విస్మరించిందని చాలా మంది అభిమానులు ఫిర్యాదు చేశారు. ఈ సంవత్సరం `భ్రమయుగం` చిత్రానికి ఆయన కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకోవడం ఈ విభాగంలో ఆయన ఏడవ విజయాన్ని సాధించినట్టయింది. మంజుమ్మేల్ బాయ్స్ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా గౌరవాన్ని అందుకోగా, చిదంబరం చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది.