బిగ్ బాస్ సీజన్ 9 లో భరణి తో నాన్న బాండింగ్ పెట్టుకున్న తనూజ.. దివ్య రాక తో తనూజ-భరణి మధ్యన నాన్న బాండింగ్ కాస్తా బీటలు వారింది. తనూజ కి భరణి కి దూరం మొదలైంది. భరణి దివ్య చుట్టూ తిరుగుతూ తనూజ ని దూరం పెట్టెయ్యడం తనూజ తీసుకోలేకపోయింది. తర్వాత భరణి బంధాల వలనే ఎలిమినేట్ అయ్యి తిరిగి హౌస్ లోకి వచ్చారు.
తనూజ భరణి విషయంలో ఎమోషనల్ అయినా దూరంగానే ఉంది. ఈ వారం భరణి కి, దివ్య కి మధ్యన దూరం పెరుగుతుంది. ఈలోపే తనూజ, భరణి లు నామినేషన్స్ లో ఫైట్ చేసుకున్నారు. ఈ వారం నామినేషన్స్ లో తనూజ కన్నా నేను బెటర్ అంటే భరణి గారి కన్నా నేను బెటర్ అనే గొడవలో ఇద్దరూ గట్టిగానే గొడవపడిన ప్రోమో వదిలారు.
ఈ వారం నామినేషన్స్ లో భరణి, తనూజ గొడవ తో వారి మధ్యన బాండింగ్ బ్రేక్ అయ్యింది. కాదు కాదు బద్దలైపోయింది. ఈ వారం తో తనూజ-ఇమ్మాన్యువల్ ఫ్రెండ్ షిప్ బాండ్ కూడా పగిలిపోయింది. తనూజ ఇమ్మాన్యువల్ ని నామినేట్ చెయ్యడంతో వారిమధ్యన గట్టిగానే ఈగో మొదలైనట్లుగా తెలుస్తుంది.