Advertisement
Google Ads BL

ఒక్క దర్శకుడి చుట్టూ ఇన్ని వివాదాలా..


హనుమాన్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా మార్కెట్ లో మోగిపోయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ హిట్ తర్వాత ఇమ్మిడియట్ గా జై హనుమాన్ అనడమే కాదు 2025 సంక్రాంతి రిలీజ్ అంటూ అనౌన్స్ చేసాడు. ఆతర్వాత జై హనుమాన్ లో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ని తీసుకొ చ్చాడు. ఆ దెబ్బకి అందరూ షాకయ్యారు. 

Advertisement
CJ Advs

ఆతర్వాత ప్రశాంత్ వర్మ నందమూరి నటసింహ వారసుడు మోక్షు ని హీరో గా ఇంట్రడ్యూస్ చేసే పని తలకెత్తుకోవడమే కాదు.. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా అనౌన్స్ చేసి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ వదిలాడు కూడా. ఆతర్వాత ప్రశాంత్ వర్మ కి మోక్షజ్ఞ కి మద్యన విభేదాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది అన్నారు. సంక్రాంతి వచ్చింది వెళ్ళింది, జై హనుమాన్ సెట్ పైకి కూడా వెళ్ళలేదు. 

ఆతర్వాత అధీర అంటూ పాన్ ఇండియా ఫిలిం ని అనౌన్స్ చేసాడు. ఆతర్వాత రీసెంట్ గా మహాకాళి ని అనౌన్స్ చేసాడు. అప్పటికే ప్రశాంత్ వర్మ అనౌన్సమెంట్ తప్ప సినిమాలను సెట్ పైకి తీసుకెళ్లడం లేదు, ఆయన PVCU కింద ఇంకెన్ని సినిమాలు అనౌన్స్ చేస్తాడో అని అందరూ వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. 

ఈలోపే నిర్మాత దానయ్య ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇచ్చాడంటూ ప్రచారం జరగడం, అసలు తామెలాంటి అడ్వాన్స్ ప్రశాంత్ వర్మకు ఇవ్వలేదు అంటూ ప్రెస్ నోట్ వదిలారు దానయ్య బ్యాచ్. ఈలోపే తాము అధీర చిత్రానికి కోటి అడ్వాన్స్ ఇచ్చామంటూ నిర్మాత నిరంజన్ రెడ్డి లైన్ లో రావడం తో ప్రశాంత్ వర్మ ఎవరిష్టమొచ్చినట్టుగా వారు రాయకండి.. 

నాకు, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కి మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ చాంబర్ / తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ పరిశీలనలో ఉంది. ఇది న్యాయపరమైన విచారణలో ఉంది, నాపై వస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు అంటూ హడావిడిగా ప్రెస్ నోట్ వదిలాడు. 

మరి ఒకటా రెండా ప్రశాంత్ వర్మ చుట్టూ ప్రస్తుతం ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. అందులో ప్రశాంత్ వర్మ తప్పులేదు అంటే ఎవ్వరు నమ్ముతారు. ఏదో ఒకటో రెండో అంటే అనుకోవచ్చు, ప్రతిదీ వివాదమే కదా.. ! అందుకే ప్రశాంత్ వర్మపై చాలామంది చాలారకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

Prasanth Varma:

Director Prasanth Varma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs