బిగ్ బాస్ సీజన్ 9 తొమ్మిదో వారానికి చేరుకుంది. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వచ్చిన దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యింది. తనూజ గోల్డెన్ పవర్ వాడకపోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడింది. ఇక ఈవారం ఎవరు నామినేషన్స్ లోకి వస్తారు, ఎవరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళతారనే విషయంలో ఆసక్తి మొదలైంది.
సోమవారం అంటే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ డే. ఈ వారం ఓ పప్పి ని పట్టుకుని ఎవరైతే సేఫ్ జోన్ లోకి వెళ్లకుండా వెనకపడతారు, ఆ పప్పి పై ఎవరి పేరు ఉందో వారు నామినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పారు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో సంజన vs రీతూ, సుమన్ శెట్టి, తనూజ ఇలా గొడవలు పడ్డారు.
ఇక ఫైనల్ గా 9వ వారం నామినేషన్‌లో ఏడుగురు ఉన్నారు. ఈ వారం శ్రీనివాస్ సాయి, రాము, సంజన, తనూజా, భరణి, సుమన్ శెట్టి, కల్యాణ్ పడాల నామినేట్ అయ్యారు. మరి ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు. అందులో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.