కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాధన్ లేటెస్ట్ మూవీ డ్యూడ్ దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 17 న విడుదలైంది. మొదటి రోజు ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా.. డ్యూడ్ మెల్లగా యూత్ కి కనెక్ట్ అవడంతో వారం తిరిగేలోపే డ్యూడ్ 100 కోట్ల క్లబ్బులోకి అఫీషియల్ గా అడుగుపెట్టింది.
థియేటర్స్ లో హిట్ అయిన డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై యూత్ కన్నేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రదీప్ డ్యూడ్ చిత్ర డిజిటల్ రైట్స్ ని ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. అయితే ఈ చిత్రాన్ని నాలుగు వారాలకే స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ రెడీ అయినట్లుగా తెలుస్తుంది.
ఈ కామెడీ చిత్రం నవంబర్ 14, 2025న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యకపోయినా నెట్ ఫ్లిక్స్ నుంచి నవంబర్ 14 నే డ్యూడ్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది అంటున్నారు.