బిగ్ బాస్ తనుజాని కాపాడుతున్నాడు, తనూజ బిగ్ బాస్ కి ముద్దుబిడ్డ. అందుకే ఆమెని హైలెట్ చేస్తున్నారు అంటూ బయట వినిపిస్తున్న మాట మాత్రమే కాదు.. రెండుసార్లు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి బయటికెళ్ళిపోయిన శ్రీజ కూడా అంటున్న మాట. అంతేకాదు శ్రీజ, తనూజ పై ఫైర్ అవుతుంది. తనూజ తప్పు చేసినా బిగ్ బాస్ వదిలేస్తున్నారు.
కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ లో తప్పు చేస్తే అది ఆమెని ఒంటరిగా కన్ఫెషన్ రూమ్ కి రమ్మని వీడియో చూపిస్తారు, ఆమె గోల్డెన్ పవర్ కోసం ఆడిన టాస్క్ సరిగ్గా ఆడలేదు. అదే నేను.. ప్రియా, సంజన గారి విషయంలో తప్పు చేసాను అంటూ రెండు రోజులు వేసుకున్న డ్రెస్ నే వేయించాడు బిగ్ బాస్. రీతూ తప్పులు చేసింది అని పవన్ కెప్టెన్సీ తీసేసారు.
ఇక ఇమాన్యువల్ సంజన గారి కోసం కెప్టెన్సీ వదులుకున్నాడు, రీతూ హెయిర్ శాక్రిఫైజ్ చేసింది. అది సంజన గారి కోసం వారు పెద్ద డెసిషన్ తీసుకున్నారు. తనూజ కాఫీ వదిలేసింది. కాని తనూజ హౌస్ లో కాఫీ తాగుతూనే ఉంది. తనూజ విషయంలో బిగ్ బాస్ ప్రేమ చూపిస్తున్నాడంటూ శ్రీజ తనూజ పై నెగెటివ్ గా వీడియో చేసింది.
అది చూసిన తనూజ అభిమానులు నువ్వు ఆడలేక మద్దెలతెరువు అన్నట్టు రెండుసార్లు హౌస్ నుంచి బయటికి వచ్చావు, అయినా నీకు బుద్ధి రాలేదు, తనూజాపై పనిగట్టుకుని విషం కక్కుతున్నావ్ అంటూ శ్రీజపై తనూజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.