కొన్ని చరిత్ర పాఠాలు భవిష్యత్ ఫిలింమేకర్స్ కి చాలా అవసరం. అలాంటి ఒక చక్కని ఉదాహరణ- బాంబే వెల్వెట్. రణబీర్ కపూర్ కథానాయకుడిగా అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితం అందుకుంది. అయితే ఈ సినిమా ఫలితం ఇలా మారడానికి కారణం సృజనాత్మక విభేధాలు.
దర్శకుడు అనురాగ్ తాను ఒకటి అనుకుంటే, నిర్మాతలు మరొకలా ఫింగరింగ్ చేసారు. కేవలం 28కోట్ల బడ్జెట్ తో రణ్ వీర్ సింగ్ లాంటి నవతరం హీరోతో ఈ సినిమాని తెరకెక్కించాలనుని అనురాగ్ భావించారు. స్టార్ పవర్ తో సంబంధం లేకుండా.. కథ, కథనం, పాత్రధారులతో మ్యాజిక్ చేయాలని ఆయన ఈ స్క్రిప్టును రాసుకున్నారు. తన పనిపై తాను చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ ఇంతలోనే ఇతరుల ప్రమేయం హద్దులు దాటింది. ఈ సినిమాకి పెద్ద హీరోని తీసుకోవాలని ఒత్తిడి పెరిగింది. కొందరు పెద్ద దర్శకులు కూడా రణబీర్ ని తీసుకోవాలని సూచించారు. దీంతో ఏమీ తోచని పరిస్థితుల్లో నిర్మాతలను వ్యతిరేకించలేక, డైలమాలోనే ఏడాదిన్నర పాటు అసలు షూటింగ్ అన్నదే చేయకుండా గడిపాడు అనురాగ్.
రణ్ వీర్ సింగ్ ఎదుట తన అసహనాన్ని కూడా వ్యక్తపరిచాడు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఒక అప్ కమ్ హీరోని అంగీకరించని ప్రొడక్షన్ హౌస్ ఎట్టి పరిస్థితిలో రణబీర్ కపూర్ లేదా ఎవరైనా పెద్ద హీరోతో మాత్రమే ఈ సినిమా తీయాలని ఒత్తిడి చేసింది. దీంతో అనూహ్యంగా బడ్జెట్ 28 కోట్ల నుంచి 90 కోట్లకు పెరిగింది. అయితే ఈ బడ్జెట్ ని అనవసర విషయాలకు ఖర్చు చేసారు మినహా ప్రధాన ఉత్పత్తి బెటర్ మెంట్ కోసం ఎక్కడా ఖర్చు చేయలేదని అనురాగ్ కశ్యప్ వెల్లడించాడు. క్రియేటర్ ని డామినేట్ చేసినందున ఫలితం కూడా అంతే ఘోరంగా వచ్చింది. బాంబే వెల్వెట్ చిత్రం రణబీర్, అనురాగ్ కశ్యప్ కెరీర్ లోనే అత్యంత చెత్త మూవీగా రికార్డులకెక్కింది.