Advertisement
Google Ads BL

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈరోజు సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై ప్రయాణిస్తున్న టిప్పర్ లారీ, 70 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. 

Advertisement
CJ Advs

ఈ ఘోర ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో చేవెళ్ల–వికారాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను సర్దుబాటు చేస్తున్నారు.

ఈ ఘటన లో 25 మంది తీవ్రంగా  గాయపడగా వారిని హైదరాబాద్ లోని నిమ్స్, గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. కంకర తీసుకెళుతున్న టిప్పర్ లారీ ఆగి ఉన్న బస్సుని ఢీకొట్టడంతో టిప్పర్ లోని కంకర బస్సుపై పడిపోవడంతో చాలామంది ప్రయాణికులు ఆ కంకర లో కూరుకుపోయిన దృశ్యాలు ఘటన స్థలంలో భయానకంగా మారాయి. లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్ తో సహా 21మంది ఈ ప్రమాదంలో మృతి చెందగా మరో ఐదుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. 

21 Dead in Chevella Road Accident:

21 killed as truck rams into passenger bus in Telangana 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs