విదేశీ క్రీడాకారుడు మాథియాస్ బోని పెళ్లాడిన తర్వాత బొత్తిగా నల్ల పూసైపోయింది తాప్సీ. తెలుగు, తమిళ పరిశ్రమలకు పూర్తిగా దూరమైంది. హైదరాబాద్ లో రేర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో నటిస్తూ బిజీగా ఉంది. `ఖేల్ ఖేల్ మెయిన్` లో చివరి సారిగా కనిపించిన ఈ రింగుల జుత్తు సోయగం, మరో మూడు కొత్త హిందీ సినిమాలతో అభిమానులను పలకరించనుంది.
సినీపరిశ్రమను వదిలి అత్తారింటికి వెళ్లిపోయింది! అంటూ ఇటీవల రెడ్డిటర్లు కామెంట్ చేయగా, దానికి తాప్సీ సరైన సమాధానమిచ్చింది. అత్తింట్లో కొంతకాలం, ముంబైలో ఎక్కువ కాలం స్పెండ్ చేస్తున్నామని తాప్సీ చెప్పుకొచ్చింది.
మరోవైపు గుబులు రేపే అందంతో తాప్సీ ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ అందాల భామ రెడ్ హాట్ ఫ్రాక్ లో హొయలు పోయిన ఫోటోగ్రాఫ్స్ వైరల్ గా మారాయి. తాప్సీ సోగ కాళ్లపై టాట్టూలు, థై స్లిట్ ఎలివేషన్ .. అలా సోఫాలో స్టైలిష్ గా కూర్చుని తీక్షణంగా చూస్తున్న తీరు ప్రతిదీ మంత్ర ముగ్ధం చేస్తోందంటూ ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.