బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు `బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` తో దర్శకుడిగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. తొలి సిరిస్ తోనే విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. యాక్షన్, కామెడీ, సెటైర్ ని పర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసాడు. స్పెషల్ రోల్స్ లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, రణవీర్ సింగ్, రాజ్ కుమార్ రావు లాంటి స్టార్లను డీల్ చేయడంలో ఎక్కడా తబడలేదు. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ నుంచి చాలా మంది సీనియర్ సహా యంగ్ హీరోలు భాగమయ్యారు. వాళ్లని సైతం తెరపై ఎంతో బ్యాలెన్స్ గా చూపించాడు. దర్శకుడిగా ఆర్యన్ తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యాడు.
దీంతో అతడి రెండవ సినిమా ఏ స్టార్ తో చేస్తాడు? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ఛాన్స్ ఎవరితో తీసుకుంటాడు? అన్న సందేహం నేపథ్యంలో డాడ్ షారుక్ ఖాన్ తన హీరో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. తండ్రికొడుకులు ఒకరితో ఒకరు ఎలాగూ పని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రెండివ సినిమా షారుక్ తో చేస్తే ఆర్యన్ ఖాన్ కి ఇంకా కలిసొస్తుంది. డైరెక్టర్ గా స్టార్ లీడ్ లో చేరడానికి పెద్ద సమయం పట్టదు. `బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` విషయంలో షారుక్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.
తనయుడిలో అంత గొప్ప క్రియేటర్ ఉన్నాడా? అని తానే షాక్ అయ్యాడు. ఈనేపథ్యంలో ఆర్యన్ కి ఛాన్స్ ఇవ్వడంలో షారుక్ పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కుమారుడు అంటే షారుక్ ఖాన్ కి ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. సినిమా రంగంలో తన పిల్లలు కూడా రాణించాలని షారుక్ బ్యాకెండ్ ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పటికే కుమార్తె సుహానాఖాన్ కి అన్ని రకాలుగా మద్దతిస్తున్నాడు. ఆమెతో కలిసి `కింగ్` సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్ కోసం షారుక్ తన ఇమేజ్ ని సైతం పక్కనబెట్టి పనిచేస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుమారుడు కోసం ఇంకెంత చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. `బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్` ని కూడా షారుక్ రెడ్ చిల్లీస్ పై నిర్మించిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ తో రెండవ సినిమా చేస్తే గనుక అదీ సొంత సంస్థలోనే ఉండే అవకాశం ఉంది.