భారతదేశంలో దిగ్గజ దర్శకులు ఎందరు ఉన్నా కానీ.. వారంతా సాధించలేని కమర్షియల్ సక్సెస్ ను సాధించి చూపిస్తున్నాడు సందీప్ వంగా. అతడి సినిమాలు ఎంతగా విమర్శల పాలైతే, అంతగా కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ .. ఈ సినిమాలన్నిటిపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు గ్రాండ్ సక్సెస్ సాధించాయి.
ప్రస్తుతం సందీప్ వంగా తెరకెక్కిస్తున్న `స్పిరిట్`పై ప్రజల ఫోకస్ ఉంది. అతడు ప్రభాస్‌ని ఏ రేంజులో చూపించబోతున్నాడో చూడాలన్న ఉత్సాహం అందరిలోను ఉంది. ఇక సందీప్ వంగా వ్యక్తిగతంగా ఇష్టపడే సినిమా ఏది? అంటే.. ఆర్జీవీ తెరకెక్కించిన `శివ` చిత్రం ఇప్పటికీ గుర్తుండిపోయిందని అన్నారు.
తనను అత్యంత ప్రభావితం చేసిన సినిమా ఇది అని వ్యాఖ్యానించారు. నాగార్జున, అమల, రఘువరణ్, శుభలేఖ సుధాకర్ వంటి దిగ్గజ తారలతో కల్ట్ జానర్ లో తెరకెక్కించిన `శివ` చిత్రానికి ఇళయరాజా సంగీతం ప్రధాన బలంగా నిలిచింది.