నిజంగా టాస్క్ ల్లో చివరి వరకు వచ్చి గెలవలేకపోవడం తన బ్యాడ్ లక్ అంటూ కామనర్ శ్రీజ ఎప్పుడు డిజప్పాయింట్ అయిట్లుగానే ఆమె రీ ఎంట్రీ విషయంలోనూ అదే జరిగింది. తన రీ-ఎంట్రీ టాస్క్ ల కోసం కళ్యాణ్ ను ఎంచుకుంది, కళ్యాణ్ భరణి కోసం ఆడిన ఇమ్మాన్యువల్ కి గట్టి పోటీ ఇచ్చాడు. కానీ ప్రేక్షకులు మాత్రం భరణి కి ఓటేసి మళ్లీ శ్రీజ కు అన్యాయం చేసారు.
ఆమె ముందు ఎలిమినేట్ అయినప్పుడే అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ గోల చేసారు. ఇప్పుడు భరణి కోసం శ్రీజ ను బలి ఇచ్చారు. ఇది సోషల్ మీడియా మాటే కాదు శ్రీజ నే స్వయంగా అంటున్న మాట. తాను హైట్ లేని వీలుకాని టాస్క్ లు పెట్టారు. గెలుస్తాను అనుకున్న టాస్క్ రద్దు చేసారు. భరణి గారి కోసమే నన్ను బలి చేసారు ఇదే నిజం.
భరణి గారు రీ ఎంట్రీ ముందే ఫిక్స్ అయ్యింది. నెను లోపల ఉండగానే భరణి గారు ఇంట్లోనే ఉంటారని మట్లాడుకున్నారు. భరణి గారిని రీ-ఎంట్రీ ఇప్పించేందుకు నన్ను బలి పశువుని చేసారు అంటూ రెండోసారి హౌస్ ని వీడిన తర్వాత వీడియో చేసి షేర్ చేసింది.