క్రికెట్ అంటే ఇష్టపడని యువత ఉండదు. చిన్న వాళ్ళ దగ్గరనుంచి పెద్ద వాళ్ళ వరకు క్రికెట్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అందులోను వరల్డ్ కప్ అంటే ఆ క్రేజ్ ని అస్సలు మిస్ అవ్వరు. పురుషుల క్రికెట్ అయినా, మహిళలు క్రికెట్ అయినా అందరూ క్రికెట్ ని ప్రేమించేవాళ్లే. ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు కూటమి ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అందరికి తెలుసు.
నేడు ఆదివారం జరగబోయే మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్ కోసం ఏపీ ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. ఈ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ కోసం టీడీపీ ఎమ్యెల్యేలు, కొంతమంది నేతలు వినూత్నంగా అలోచించి ప్రజలనందరిని ఒక్క చోటికి చేర్చి క్రికెట్ ని ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసారు.
అందుకోసం బిగ్ స్క్రీన్ల ను ఏర్పాటు చేసారు. టీడీపీ ఎమ్యెల్యేలు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ల వద్ద మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చూసేందుకు ప్రజలు కోకొల్లలుగా హాజరయ్యారు. అంతేకాదు అందరూ కలిసి క్రికెట్ చూసేందుకు కేరింతలు కొడుతూ నేతలకు థాంక్స్ చెబుతున్నారు.
భారత్ vs సౌత్ ఆఫ్రికా నడుమ జరిగే ఈ ఫైనల్ పోరులో ఇండియా విజయంసాధించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏకస్వరంతో ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాల కోసం ప్రజలను కలుపుతూ, క్రీడలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తూ ముందడుగు వెయ్యడం నిజంగా శుభపరిణామం అంటూ ఏపీ ప్రజలు కొనియాడుతున్నారు.