కింగ్ ఖాన్ షారూఖ్ నేడు తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అంటే ఈరోజు అతడి షష్ఠిపూర్తి. ఈ వేడుకల కోసం ఖాన్ లు సహా తనకు అత్యంత సన్నిహితులను షారూఖ్ అతిథులుగా ఆహ్వానించాడు. ఇంతలోనే ఇప్పుడు బర్త్ డే కానుకగా కింగ్ టీజర్ విడుదలైంది.
టీజర్ ఆద్యంతం బాద్ షా మెరుపులే మెరుపులు. షారూఖ్ నెవ్వర్ బిఫోర్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. వయసు 60 నుంచి 40కి షిఫ్టయిందా? అనిపించేంతగా అతడిలో మేకోవర్ ఆశ్చర్యపరిచింది. గ్రే హెయిర్, ఫంకీ హెయిర్ స్టైల్ తో అతడు ఎంతో యంగ్ గా కనిపిస్తున్నాడు. నిజానికి ఈ చిత్రంలో ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడని కథనాలు వచ్చినా కానీ, అందుకు భిన్నమైన లుక్ లో షారూఖ్ కనిపిస్తున్నాడు. ఇదే చిత్రంతో సుహానా ఖాన్ పెద్ద తెర ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
కానీ సుహానా ఈ టీజర్‌లో కనిపించలేదు. టీజర్ ఆద్యంతం షారూఖ్ యాక్షన్ మోడ్‌ని, ఇంటెన్సిటీని ఆవిష్కరించారు. జాలి దయ అనేవి కనిపించని ఒక క్రూరమైన డాన్ గా షారూఖ్ ని ఆవిష్కరించాడు సిద్ధార్థ్ ఆనంద్. తాను ఎంతమందిని చంపాడో కూడా లెక్క తెలియని క్రూరుడిగా ఖాన్ కనిపిస్తున్నాడు. పఠాన్ లాంటి భారీ యాక్షన్ చిత్రంతో షారూఖ్ కి ఎదురే లేని విజయాన్ని అందించిన సిద్ధార్థ్ కింగ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారనడంలో సందేహం లేదు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.