అల్లు శిరీష్ నయనిక అనే అమ్మయిని ప్రేమించి పెద్దల అంగీకారంతో అక్టోబర్ 31 న నిశ్చితార్ధం చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీ, ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్ మద్యన అల్లు శిరీష్-నయనిక ల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే అల్లు శిరీష్ చేసుకోబోయే అమ్మాయి నయనిక ఎవరు, శిరీష్ తో నయనిక కు ఎలా పరిచయమైంది అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.
తాజాగా అల్లు శిరీష్ తన లవ్ స్టోరీని బయటపెట్టాడు. తనకు-నయనికకు ఎలా పరిచయమైంది, అది ప్రేమగా ఎలా మారిందో అనేది రివీల్ చేసాడు. 2023 లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ల పెళ్లి సందర్భంగా నితిన్, అయన భార్య షాలిని ఓ గ్రాండ్ పార్టీ ఇవ్వగా ఆ ఫంక్షన్ కి షాలిని ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది.
అప్పుడే మేమిద్దరం మొదటిసారిగా కలుసుకున్నాం.. ఆ తర్వాత ప్రేమలో పడి, ఇప్పుడు నిశ్చితార్ధం చేసుకున్నామని శిరీష్ తమ అందమైన ప్రేమ కథను రివీల్ చెయ్యడమే కాదు రేపు మా పిల్లలు .. మా ఇద్దరి లవ్ స్టోరీ గురించి అడిగితే, మీ అమ్మను ఇలాగే కలిశానని చెబుతానని శిరీష్ తన లవ్ స్టోరీని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.