అవును అందానికే అసూయా పుడుతుందేమో జాన్వీ కపూర్ ని చూస్తే. ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే ఎవ్వరైనా అదే అనుకోవాలి. క్రీమ్ కలర్ డిజైనర్ దుస్తుల్లో జాన్వీ కపూర్ ఒంటినిండా నగలుతో మెరిసిపోయింది కాదు కాదు ఏంజిల్ లా కనిపించింది. ఎప్పుడు ఫ్రెష్ లుక్స్ తో మెస్మరైజ్ చేసే జాన్వీ కపూర్ మరోసారి మురిపించింది.
హెవీ అండ్ రాయల్ లుక్ లో జాన్వీ కపూర్ ని అలా చూస్తే మాటల్లేవ్, మాట్లాడుకోవటాల్లేవ్ అంటారు. మరికొందరైతే ఎంతందంగా ఉన్నావే ఎవరే నీవు అంటారు. అంత చక్కటి కాస్ట్యూమ్స్ అందుకు తగిన అందం తో జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
నిన్న పెద్ది చిత్రం నుంచి జాన్వీ కపూర్ కేరెక్టర్ లుక్ వదిలారు. అందులో లంగావోణీ లోను జాన్వికపూర్ అంతే అందంతో ఆకట్టుకుంది. మీరు కూడా జాన్వీ తాజా పిక్స్ పై ఓ లుక్కెయ్యండి.