పాపం శ్రీలీల. అదే ఆమె అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట. కారణం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా ఈ క్యూటి కి సక్సెస్ అనే పదం చేతివరకు వచ్చి చేజారిపోతుంది. ధమాకా హిట్ తర్వాత శ్రీలీల ఒకటా రెండా పొలోమని పలు సినిమాలు చేసింది. కానీ ఏ ఒక్కటి శ్రీలీల కి సంతృప్తి ఇచ్చే హిట్ పడలేదు.
గుంటూరు కారం పై హోప్స్ పెట్టుకుంది, అది నిరాశపరిచింది. ఇప్పుడు మాస్ జాతర కూడా శ్రీలీల ను బాగా ఊరించింది. మాస జాతర తో ఎలాగైనా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని శ్రీలీల చాలా కష్టపడింది. డాన్స్ లు, లుక్స్ విషయంలో శ్రీలీల చాలా బావుంది. ఆమె పాత్రకు న్యాయం చేసింది. కానీ మాస్ జాతర టాక్ ఆమెను మళ్లీ ఇబ్బంది పడేలా చేసింది.
మాస్ జాతర తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూసినా అది వర్కౌట్ అవ్వలేదు. శ్రీలీల కి కష్టాలు కంటిన్యూ అనేది అందుకే. మరి మాస్ జాతర మోసం చేసినా.. శ్రీలీల కు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఎలాంటి కమ్ బ్యాక్ ఇప్పిస్తాడో చూడాలి. ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలనేది ఆమె అభిమానుల బలమైన కోరిక.