బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం డిమాన్ పవన్ ని మెడ పట్టి గెంటేసినంత పని చేసారు హోస్ట్ నాగార్జున. రీతూ ని మ్యాన్ హ్యాండిల్ చేసినందుకు పవన్ ని హౌస్ లోనుంచి బ్యాగ్స్ సర్దుకుని వెళ్లిపోవాలని అన్నారు. నాగార్జున గట్టిగానే డిమోన్ పవన్ ను భయపెట్టారు. రీతూ కే కాదు అమ్మాయిలందరికి సారీ చెప్పించారు.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న తనూజ, కళ్యాణ్, పవన్, రీతూ, మాధురి, రాము, గౌరవ్, సంజన లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఉత్సుకత చాలా మందిలో ఉంది. అయితే మాధురి, గౌరవ్ లకు ఈ వారం లీస్ట్ ఓట్స్ రావడంతో వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అన్నా.. తనూజ తన పవర్ తో మాధురి ని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడని అన్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ వారం మాధురి ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి వచ్చిన మూడు వారాలకే మాధురి ఇలా ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడింది. ఆమె చక్కగా ఆడుతున్నా ఆమె మాట తీరుకి బయట శత్రువులు తయారయ్యారు. అందుకే మధురిని ఆడియన్స్ త్వరగా బయటకు పంపేశారు.