Advertisement
Google Ads BL

అలాంటి వ్యాధితో సఫర్ అవుతున్న రాజశేఖర్


హీరో నుంచి కేరెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అవుతున్న రాజశేఖర్ ని విలన్ కేరెక్టర్స్ లో చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన శర్వానంద్ బైకర్ లో కీ రోల్ పోషించారు. బైకర్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్ తానొక అరుదైన వ్యాధితో బాధపడినట్టుగా చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చారు. 

Advertisement
CJ Advs

నేను సినిమాలకు గ్యాప్ ఇచ్చాను. నిజంగా వర్క్ లేకుండా ఇంట్లో ఉంటే అది జైలే.. నాకు కరోనా వచ్చిన తర్వాత, నా పనులు కూడా నేను చేసుకోలేక నడవలేను అన్న పరిస్ధితుల్లోకి వెళ్ళినప్పుడు దాని నుంచి ఎలాగైనా బయటపడాలని కష్టపడి 2, 3 నెలల్లో నడిచి కోలుకున్నా..  దాదాపు ఆరు నెలల్లో మాములుగా అయ్యాను. నాకు పని కావాలి. 

గతంలో హీరో గా చేసినప్పుడు ఎలాంటి లుక్ లోకి మారాలి, ఎలాంటి సినిమాలు చెయ్యాలని అనుకుంటూనే 100 సినిమాలు చేసి అలిసిపోయాను. ఇక ఇప్పుడు నాదగ్గరకు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వచ్చాయి. నేను కూడా హీరోగానే కాదు, మంచి పాత్రలొస్తే చేయాలనుకున్నాను. కానీ కథలు విన్నాక చెయ్యకూడదని నిర్ణయించుకున్నాను. 

అలాంటి సమయంలోనే బైకర్ కథ నా దగ్గరకు వచ్చింది. శర్వా హీరో అంటే నేను ఎలా అనుకున్నాను. కానీ బైకర్ సబ్జెక్ట్ బాగుందని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నా.. అని చెప్పిన రాజా శేఖర్ ఈరోజు కూడా తను ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను అని నాకు మామూలుగానే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్.. ఎప్పటి నుంచో ఆ విషయంలో సఫర్ అవుతున్నా.. 

ఈ ఈవెంట్ లో ఎలా పాల్గొంటాను అంటూ నాకు యాంగ్జయిటీ, నా కడుపు చెడిపోయింది. అయినా నేను ఈ సినిమా గురించి మాట్లాడుతున్నావు అంటూ రాజశేఖర్ తను తన వ్యాధి తో ఎలా సఫర్ అయ్యానో చెప్పుకొచ్చారు. 

Rajashekar Opens Up About Struggling With Irritable Bowel Syndrome :

Rajashekar Opens Up About Struggling With Irritable Bowel Syndrome At Stage Event 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs