బిగ్ బాస్ సీజన్ 9 లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యువల్ మొదటివారం నుంచి ఈ వారం వరకు అస్సలు నెగిటివిటి లేకుండా చూసుకుంటున్నాడు. అందరితో కలిసిపోయి, కామెడీ చేస్తూ హోస్ట్ నాగార్జున తో బంధాలు లేవు అంటూనే సంజనతో మమ్మి బంధం పెట్టుకుని, ఫ్రెండ్స్ గా ఉన్న తనూజ ను దూరం పెట్టి వైల్డ్ కార్డులు వచ్చాక తనూజ ను టార్గెట్ చేసాడు.
కళ్యాణ్ కి చీటీ ఇచ్చి తనూజాను నామినేట్ చెయ్యమని, కళ్యాణ్ మోసం చేసాడు అంటూ తర్వాత వారం తనూజ ను నామినేట్ చేసాడు. ఇమ్మాన్యువల్ తనని కాదని రాముని ఓనర్ గా డెసిషన్ తీసుకున్న సమయంలో తనూజ తనని మోసం చేసింది అంటూ ఆమెను నామినేట్ చేసాడు. కానీ తనూజ.. ఇమ్మాన్యువల్ రాము ని పంపించమని సైగ చేస్తేనే నేను రాము కి ఓటు వేసాను అంది, రెండు నాలుకలతో ఇమ్మాన్యువల్ మాట్లాడుతున్నాడు అంది.
అయితే ఈవారం నాగార్జున భరణిని మళ్లీ సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అంటూ అతని తప్పుని సుమన్ శెట్టి తో చెప్పించారు. అంతేకాదు ఇమ్మాన్యువల్ నీకేమైనా మతిమరుపు ఉందా అని అతని మొహం పై కత్తి దించి నువ్వు తనూజ ను చిన్న కారణంతో నామినేట్ చేస్తాను అన్నావ్, కానీ తనూజ నువ్వు తల ఊపడం వల్లే రాముకి ఓటేసింది.. అంటూ వీడియో వేసి ఇమ్ము కి బొమ్మ చూపించారు.
దానితో ఇమ్మాన్యువల్ షాక్ అయ్యాడు, తనూజ లేచి ఇమ్ము చెప్పబట్టే నేను రాముని ఓనర్ ని చేశాను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అయితే ఇక్కడ నామినేషన్స్ వేసేటప్పుడు బలమైన కారణముండాలి అంటూ నాగార్జున చెప్పడం చూసి.. తనూజ బిగ్ బాస్ ముద్దుబిడ్డ అందుకే ఆమెను ఇలా హైలెట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.