బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం చాలా గొడవలు జరిగాయి. తనూజ తన కేరెక్టర్ ని తనే తగ్గించుకునేలా ప్రవర్తిస్తుంది. సంజన, మాధురి ఫుడ్ విషయంలో రేషన్ మేనేజర్ గా తనూజ స్ట్రాంగ్ గా నించున్నా ఆమెకు అది బ్యాడ్ అయ్యింది. సంజన ఫుడ్ వదిలెయ్యడం, మాధురి నిరాహార దీక్ష చెయ్యడం, కళ్యాణ్ తనూజ గొడవ పై ఈ శనివారం ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఫైర్ అయ్యారు.
అదంతా ఒక ఎత్తు డిమోన్ పవన్ రీతూ గొడవలో కెప్టెన్ బెడ్ పైకి రీతూ ని తోసెయ్యడంపై నాగార్జున పవన్ పై ఫైర్ అయ్యారు. ఆ వీడియో చూపించగా పవన్ సారీ చెప్పాడు. సారీ చెబితే సరిపోదు.. ఇలాంటివి హౌస్ లో కుదరవు, మీ ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తే బెల్ట్ తో కొడతారా అని ఆడియన్స్ ని అడగా.. పవన్ అలా తొయ్యడం తప్పే అన్నారు ఆడియన్స్..
దానితో నాగార్జున పవన్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటూ అరిచారు. రీతూ ఎంతగా సర్ సర్ అంటూ పిలుస్తున్నా బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అంటూ నాగార్జున చెప్పడంతో డిమాన్ పవన్ ని ఈ రోజు నాగార్జున హౌస్ నుంచి పంపించేసారా అనే అనుమానం ఆడియన్స్ లో మొదలైంది. ఇది ఈరోజు ప్రోమో హైలైట్స్.