బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజ నాన్న అంటూ భరణి తో బాండింగ్ పెట్టుకుంది. ఆతర్వాత దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో భరణి ని అన్నా అంటూ జిడ్డులా అతుక్కోవడంతో భరణి ని ప్రేక్షకులు బయటికి పంపేశారు. తనూజ ను దూరం పెట్టి దివ్య తో తిరిగిన భరణి కి ఆడియన్స్ ఎలిమినేట్ చేసి పనిష్మెంట్ ఇచ్చినా ఆయనకు హౌస్ లోకి రావడానికి మరో అవకాశం దక్కింది.
తానెందుకు హౌస్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందో భరణి రివ్యూ వేసుకుని చాలా క్లారిటీతో దివ్య ను దూరం పెట్టాలని హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. భరణి ఫ్యామిలీగా ప్రొజెక్ట్ అవ్వగా ఆ ట్యాగ్ తొలగించుకునేందుకు భరణి ప్రయత్నం చేసినా దివ్య మాత్రం ఆయన్ని వదలడం లేదు. భరణిని హౌస్లో ఉండేలా చేసేందుకు దివ్య, ఇమ్మాన్యువల్ ఆయన బదులు గేమ్ ఆడారు. దానితో దివ్య భరణి ని వదలడం లేదు.
గత రాత్రి బిర్యానీ టాస్క్ లో చికెన్ ముక్కల విషయంలో మాధురి కిభరణి కి మధ్య ఇష్యు జరిగింది. మాధురి చికెన్ పీస్ అడిగితె భరణి వెయిట్ చెయ్యమన్నాడు. దానితో మాధురి అలిగింది. అప్పుడు దివ్య నేను కెప్టెన్ ను నేను చెబుతున్నా వినండి అనగానే మాధురి కోపంతో లోపలికి వెళ్ళిపోయింది. లోపల కూడా నేను భరణి గారితో మాట్లాడుతుంటే దివ్య మధ్యలోకి రావడమేమిటి అంటూ మాట్లాడింది.
అప్పుడు తనూజ భరణి దగ్గరకు వెళ్లి మీ గేమ్ మీరు ఆడండి, ఇది మీ గేమ్, మధ్యలో దివ్య ఎవరూ అంటూ భరణి కి క్లాస్ పీకిన ప్రోమో వేశారు.