Advertisement
Google Ads BL

కాశీబుగ్గ ఆలయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు


తిరుపతిలో వేంకటేశ్వరుని దర్శనం దొరకలేదు అని పాండా అనే భక్తుడు శ్రీకాకుళ జిల్లా కాశీబుగ్గలో 12 ఎకరాల్లో వేంకటేశ్వరుని గుడిని నిర్మించాడు. 10 కోట్లతో నిర్మించిన ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి గత ఏడాదే వచ్చినా ఈ ఏడాది మే లోనే దేవుడి దర్శనాలు ప్రారంభమయ్యాయి. గుడి ప్రారంభమైన మొదటి ఏడాదిలో వచ్చిన మొదటి కార్తీక మాసం ఏకాదశి నాడు వెంకటేస్వరుణ్ణి దర్శించుకోవడానికి 25 వేలమంది భక్తులు వచ్చారు. కేవలం రెండు వేల కెపాసిటీ ఉన్న గుడికి 25 వేలమంది రాక తో అక్కడ తొక్కిసలాట జరిగి దాపుగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది అందరిని కలిచివేసింది.

Advertisement
CJ Advs

ఈ గుడికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ కాశీబుగ్గ ఆలయంలో ప్రభుత్వ పరిధిలో లేదు. ఓ ప్రవేట్ వ్యక్తి నడిపిస్తున్న ఆలయం అది. అక్కడ కి భక్తులు ఇంతమంది వస్తారని ఎవరికీ అంచనాలేదు, ఎవరూ అధికారులకు చెప్పలేదు. కానీ వైసీపీ నేతలు ఇందులో కూటమి ప్రభుత్వం తప్పు ఉంది అనేలా మాట మాట్లాడం ఎంతవరకు సమంజసం. 

ఆ గుడి లో దర్శనాలు మొదలయ్యాక మీడియాలో ఇన్ఫ్లుయన్సెర్స్ ఆ గుడిపై వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేసారు. అందుకే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అసలు అక్కడికి ఎవరి ప్రమేయం లేకుండానే ఇంతమంది ప్రజలు రావడం విడ్డురమే. ఆ ఘటన జరిగిన సమయంలో వైసీపీ YCP ఇన్‌చార్జ్ అప్పల రాజు అక్కడ ఉండడం, ఘటన జరిగిన తర్వాత ఆ అప్పలరాజు బాధితులకు CPR చెయ్యడం వెనుక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా అనే కోణంలోను ఆలోచించాల్సి ఉంది. 

10 people killed at Kasibugga temple stampede:

Ten Killed, Several Injured In Stampede At Kasibugga
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs