నిన్న అక్టోబర్ 31 సాయంత్రం అల్లు శిరీష్-నయనిక ల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అల్లు శిరీష్, నయనిక లు డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఈ వేడుకలో మరింత స్పెషల్ గా రెడీ అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన, సురేఖ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, నాగబాబు ఫ్యామిలీ అంతా అల్లు శిరీష్ నిశ్చితార్థంలో సందడి చేసారు.
మెగాస్టార్ చిరు అయితే శంకర్ వర ప్రసాద్ సెట్ నుంచి నేరుగా శిరీష్ ఎంగేజ్మెంట్ కి వచ్చేసారు. అయితే అల్లు శిరీష్-నయనిక ల నిశ్చితార్థంలో ఒకరు చాలా స్పెషల్ గా కనిపించారు. ఆమె పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా. పవన్ ఈ వేడుకకు రాకపోయినా అన్నా లెజెనోవా అల్లు శిరీష్ ఫంక్షన్ కి హాజరయ్యారు.
అన్నా తో తోడికోడలు సురేఖ, అలాగే రామ్ చరణ్ ఫోటోలు దిగారు. పవన్ భార్య అన్నా అల్లు శిరీష్ వేడుకలో చీరకట్టులో కనిపించడంతో అందరూ శిరీష్ ఎంగేజ్మెంట్ లో ఆమె చాలా స్పెషల్ అంటూ మాట్లాడుకుంటున్నారు.