ప్రతి నెలలో క్రేజీ సినిమాలు వస్తున్నాయి.. అందులో ఒక నెల లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తుంటే.. ఒక నెలలో ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసే సినిమాలు వస్తున్నాయి. గత నెలలో విడుదలైన కాంతార చాప్టర్ 1 ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. పాన్ ఇండియా మార్కెట్ లో 800 కోట్లకు పైగా కొల్లగొట్టింది.
ఈ నెలలోను క్రేజీ సినిమాల తాకిడి ఉండబోతుంది. అయితే ఈ నెల మాత్రం సినిమాల కోసం క్రేజీగా మారలేదు.. ఒకే ఒక్క సినిమా అప్ డేట్ కోసం నవంబర్ నెల క్రేజీగా మారిపోయింది. ప్రపంచమంతా ఆ ఒక్క అప్ డేట్ కోసం వెయిట్ చేస్తుంది. మహేష్-రాజమౌళి ల #GlobeTrotter అప్ డేట్ కోసం మహేష్ అభిమానులే కాదు వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంది.
రాజమౌళి నవంబర్ లో #SSMB29 అప్ డేట్ ఇస్తాను అన్నారు. ఈ నెల 16 న హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమరూన్ చేతుల మీదుగా #GlobeTrotter టైటిల్ టీజర్ తో పాటుగా ఇంకేం SSMB 29 పై బయటపెడతారో అనే విషయంలో అందరూ విపరీతమైన క్యూరియాసిటిలో ఉన్నారు. అందుకే అంతగా నవంబర్ ఎప్పుడు వస్తుందా అని .
మరి నవంబర్ లో సోషల్ మీడియా #GlobeTrotter అప్ డేట్ తో క్రాష్ అవడం మాత్రం ఖాయం. ఇది మహేష్ ఫ్యాన్స్ అంటున్న మాట. మరి రాజమౌళి ఏం చేస్తారో చూడాలి.