కోలీవుడ్ హీరో విశాల్ కు తమిళ దర్శకుల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. కారణం ఏమిటంటే.. విశాల్ ఈ మధ్యన తను నటిస్తున్న సినిమా దర్శకుడితో గొడవపడి ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు టేకోవర్ చేసారు. ఆ విషయాన్ని దీపావళి సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. విశాల్ నిర్ణయంపై దర్శకుల సంఘం విశాల్ పై ఫైర్ అవుతుంది.
రవి అరసు దర్శకత్వంలో విశాల్ మకుటం అనే చిత్రాన్ని స్టార్ట్ చేసారు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా 50 శాతం పూర్తయ్యింది. ఆతర్వాత విశాల్ కి-రవి అరసు కి మధ్యన విభేదాలు తలెత్తయ్యాయి. దానితో మకుటం డైరెక్షన్ బాధ్యతల నుంచి రవి అరసు ని తప్పించి ఆ సినిమాని పూర్తి చేసే బాధ్యతని విశాల్ నెత్తినెత్తుకున్నారు. ఆ విషయంలోనే తమిళ దర్శకుల సంఘం విశాల్ కి షాకిచ్చింది.
మకుటం షూటింగ్ తిరిగి ప్రారంభం కావాలంటే రవి అరసు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని విశాల్ తప్పనిసరిగా తీసుకోవాలని.. అప్పటివరకు మకుటం షూటింగ్ చెయ్యడానికి వీల్లేదని అల్టిమేటం జారీ చేసింది. మరి ఈ విషయంలో విశాల్ ఏం చేస్తారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.