తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగినా అంతా గుట్టుగా చేద్దామని చూసింది, కానీ మీడియా మాత్రం ఎట్టాగో పసిగట్టేసింది. తర్వాత ఇద్దరి మధ్యన విభేదాలు రావడంతో తమన్నా-విజయ్ వర్మ కు బ్రేకప్ అయ్యింది. ఆతర్వాత కూడా తమన్నా చాలా సైలెంట్ గా తన పని తను చూసుకుంటుంది. విజయ్ వర్మ మరో హీరోయిన్ తో మూవ్ ఆన్ అయ్యాడు అనే ప్రచారం ఉంది.
తాజాగా తమన్నా తన బ్రేకప్ పై ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యింది. తనకు అబద్దాలు చెప్పేవాళ్ళు అన్నా, పక్కనే ఉండి మోసం చేసే వాళ్ళు అయినా అస్సలు నచ్చదు అని.. నేను ఒక గొప్ప లైఫ్ పార్టనర్ గా మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయనకు నేను లక్కీ అనిపించేలా, అతనికి నేను వరంగా ఉండాలని కోరుకుంటాను.
నెను అలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. నా బంధంలో నిజాయితి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తమన్నా చెప్పడం చూసి ఆమె విజయ వర్మ బంధంలో ఇబ్బంది పడింది, అందుకే తమన్నా, విజయ్ వర్మతో విడిపోయింది అంటూ నెటిజెన్లు మాట్లాడుకుంటున్నారు.