అల్లు వారబ్బాయి, హీరో అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తను ఇష్టపడిన నయనికతో ఏడడుగులు నడించేందుకు పెద్దల అంగీకారం పొందాడు. ఈరోజు అక్టోబర్ 31 శుక్రవారం సాయంత్రం అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ అల్లు అరవింద్ నివాసంలోనే అంగరంగ వైభవంగా జరిగింది.
నయనికకి అల్లు శిరీష్ నిశ్చితార్ధపు ఉంగరం తొడిగాడు. నయనిక అల్లు శిరీష్ కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగింది. అల్లు శిరీష్ నయనిక లు ఎంగేజ్మెంట్ దుస్తుల్లో మెరిసిపోయారు. అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగినట్లుగా ఈ ఫొటోస్ చూస్తేనే తెలుస్తుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరు, ఆయన ఫ్యామిలీ, ఇంకా కొద్దిమంది సన్నిహితులు హాజరైనట్లుగా తెలుస్తుంది.