టాలీవుడ్ లో కొన్నాళ్లుగా వినిపించని పేరు మహానటి కీర్తి సురేష్ ఇప్పుడు విజయ్ దేవరకొండ కు జోడిగా రౌడీ జనార్దన్ లో నటిస్తుంది. అంతేకాకుండా అదే దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రంలో కీ రోల్ పోషిస్తుంది అనే టాక్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గత ఏడాది కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని ని వివాహం చేసుకుంది. భర్త తో కలిసి చేసిన వెకేషన్ ఫొటోస్ షేర్ చెయ్యకపోయినా.. ఆమె మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఆమె దుబాయ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది.
ఆమె దుబాయ్ ట్రిప్ లో సెల్ఫీతో పాటు, తిన్న ఫుడ్ ఫోటోలను కూడా కీర్తీ సురేష్ షేర్ చేసింది. ఎర్లీ మార్నింగ్ ప్రయాణం కావడంతో ఇలా బిజీగా వున్నాను అంటూ కీర్తి సురేష్ షేర్ చేసిన పిక్ లో ఆమె నేచురల్ గా మేకప్ లేకుండా బ్యూటిఫుల్ గా ఆకట్టుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ దుబాయ్ ట్రిప్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.