హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యాడు. తను ప్రేమించిన శిరీష మెడలో మూడు ముళ్ళు వేసి పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచాడు. ప్రతినిధి 2 లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారిన నారా రోహిత్-శిరీష్ లెల్ల గత రాత్రి హైదరాబాద్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతుల చేతుల మీదుగా వివాహం చేసుకున్నారు.
నారా వారి ఇంట శుభకార్యమంటే అది ఏ రేంజ్ లో జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదు. గత నాలుగు రోజులుగా నారా రోహిత్ వివాహ వేడుకలు హైదరాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. గత రాత్రి జరిగిన నారా రోహిత్ వివాహానికి అతిరథమహారదులు, పలువురు సినిమా, రాజకీయనాయకులు హాజరయ్యారు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న నారా రోహిత్ ఫైనల్ గా ఓ ఇంటివాడవడంతో ఆయన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నారా రోహిత్ - శిరీష వివాహానికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.