ప్రదీప్ రంగనాధన్ హీరోగా తమిళనాట తెరకెక్కిన డ్యూడ్ చిత్రం అక్టోబర్ 17 దీపావళి స్పెషల్ గా విడుదలైంది. విడుదలైన రోజు డ్యూడ్ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించినా వీకెండ్ సమయానికి డ్యూడ్ పుంజుకోవడం.. అటు తమిళ, ఇటు తెలుగు ఆడియన్స్ మరోసారి ప్రదీప్ రంగనాధన్ ని ఆదరించి 100 కోట్లు కట్టబెట్టారు.
వరసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. 100 కోట్ల క్లబ్బులోకి మూడుసార్లు అడుగుపెట్టి ప్రదీప్ రంగనాధన్ సెన్సేషనల్ హీరోగా మారాడు. డ్యూడ్ చిత్రానికి యూత్ కనెక్ట్ అవడంతో థియేటర్స్ లో మంచి హిట్ అయ్యింది. రెండు వారాల క్రితమే విడుదలైన డ్యూడ్ ఓటీటీ డేట్ పై ఓటీటీ ఆడియన్స్ కన్నేశారు.
తాజాగా డ్యూడ్ చిత్ర ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ నవంబర్ 14 నుంచి డ్యూడ్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ మద్యన బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా నెల తిరగకుండానే ఓటీటీలోకి అడుగుపెట్టడంతో.. డ్యూడ్ కూడా అక్టోబర్ 17 న థియేటర్స్ లోకి వస్తే.. నవంబర్ 14 న ఓటీటీలోకి వచ్చేసే ఛాన్స్ చాలా ఎక్కువే ఉంది మరి.