అల్లు వారబ్బాయి, హీరో అల్లు శిరీష్ ఫైనల్లీ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రేపు అంటే అక్టోబర్ 31 సాయంత్రం అల్లు అరవింద్ ఇంట్లోనే అల్లు శిరీష్ నిశ్సితార్ధం ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లు శిరీష్ నయనికా తో ప్రేమలో ఉన్నాడు. పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్టుగా, తనకు నాన్నమ్మ అల్లు కనకరత్నం గారి ఆశీస్సులు ఉంటాయంటూ అతని ఎంగేజ్మెంట్ విషయాన్ని రివీల్ చేసాడు.
అయితే అల్లు శిరీష్ ఇంట్లో జరుగుతున్న నిశ్చితార్ధపు ఏర్పాట్ల పిక్ పోస్ట్ చేస్తూ.. బయట ఎంగేజ్మెంట్ చేసుకుందామని ప్లాన్ చేశాం. కానీ, వాతావరణం.. దేవుడి ప్లాన్స్ మరోలా ఉన్నాయి అంటూ కాస్త డిజప్పాయింట్ మోడ్ లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
మొంతా తుఫాను రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్లు శిరీష్ తన ఇంటి బయట ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే ఈ తుఫాను ఆ పనులన్నీ తడిచిముద్దయ్యేలా చేసాయి. అందుకే శిరీష్ తన నిశ్చితార్దాన్ని బయట స్టేజ్ పై ప్లాన్ చేసుకుంటే అకాల వర్షాలు శిరీష్ ప్లాన్ ని తారుమారు చేసాయి.
ఇక అల్లు శిరీష్ - నయనికా నిశ్చితార్ధానికి మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఇంకా కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తుంది.