కల్వకుంట్ల కవిత ప్రస్తుతం పార్టీ నుంచి తండ్రి అధికారం నుంచి బయటికి వచ్చి సొంత కుంపటి పెట్టే పనిలో పడింది. కేసీఆర్ నుంచి కవిత దూరమవ్వడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావు అంటూ పలుమార్లు హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి పై కవిత వ్యాఖ్యల ఫలితం ఆమెను తండ్రి కేసీఆర్.. పార్టీ నుంచి పంపించేశారు.
హరీష్ రావు వలన భవిష్యత్తులో కేటీఆర్ కూడా ఇబ్బందిపడతారంటూ అన్న కేటీఆర్ ని కూడా కవిత హెచ్చరించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్ని ఎమన్నా కూతురు కవిత ను పక్కనపెట్టి కేసీఆర్ మేనల్లుడు హారిష్ రావు వైపే మొగ్గు చూపారు. అయితే హారిష్ రావు పై కవిత పలుమార్లు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
కానీ హరీష్ రావు కవిత కామెంట్స్ పై ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. మేనమావ కేసీఆర్ చెప్పినట్టే నడుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు తండ్రి, కవిత మావయ్య సత్యన్నారాయణ పరమపదించారు. దానితో కవిత హరీష్ రావు ఇంటికి వెళ్లి తన మావయ్య ఫొటోకు నివాళులు అర్పించి తన భర్త తో కలిసి హారిష్ రావుని ఆయన ఫ్యామిలీని పరామర్శించి వచ్చిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.