యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత బాలీవుడ్ పై మోజుపడి బడా సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సారథ్యంలో స్పై యూనివర్స్ వార్ 2 లో వన్ ఆఫ్ ద హీరోగా నటించేందుకు ఓకే చెప్పాడు. హృతిక్ లాంటి స్టార్ హీరో తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కానీ వార్ 2 చిత్రం థియేటర్స్ లో ప్రేక్షకులను అస్సలు ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది.
వార్ 2 రిజల్ట్ ఏమైనా సౌత్ లో పీక్స్ లో ఉన్న ఎన్టీఆర్ ఇలా బాలీవుడ్ కి వెళ్లి తప్పు చేసాడనే మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలిచివేసింది. ఇప్పుడు మరో సౌత్ హీరో అదే తప్పు చేస్తున్నాడా, అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఆయనే తమిళనాట స్టార్ హీరోగా ఎదిగిన శివ కార్తికేయన్.
శివ కార్తికేయన్ కూడా బాలీవుడ్ కి జంప్ అవుతున్నాడనే వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. వరుణ్ డాక్టర్, అమరన్ చిత్రాలతో స్టార్ స్టేటస్ దక్కించుకున్న శివ కార్తికేయన్ ఇప్పుడే హిందీలోకి ఎంటర్ అవడం అవసరమా అనడమే కాకుండా ఎన్టీఆర్ మాదిరి కాస్ట్లీ మిస్టేక్ చెయ్యకు అనే సలహాలు ఇస్తున్నారట.
మరి శివ కార్తికేయన్ హిందీ ఎంట్రీ ప్లాన్ ఏమిటో అనేది కొద్దిగా వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది అంటున్నారు..