Advertisement
Google Ads BL

పైథాన్‌ని నెక్లెస్‌లా ధ‌రించిన గ్లోబ‌ల్ ఐకాన్


గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఏం చేసినా అది ప్ర‌త్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా పీసీ ధైర్య సాహ‌సాల గురించి ఎవ‌రూ ప్ర‌త్యేకించి గుర్తు చేయాల్సిన ప‌ని లేదు. ఇప్పుడు అలాంటి మ‌రో సాహ‌సంతో యువ‌త‌రంలో చ‌ర్చ‌గా మారింది. ప్రియాంక చోప్రా ఒక భారీ పైథాన్ ని మెడ‌లో వేసుకుని ఆట‌లు ఆడుకుంటోంది. త‌న చెంత‌నే ఉన్న భ‌ర్త నిక్ జోనాస్ తో ప‌రాచికాలు ఆడుతూ అత‌డిని భ‌య‌పెట్టేస్తున్న తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Advertisement
CJ Advs

అయితే ప్రియాంక చోప్రాకు ఇలాంటి సాహ‌సాలు ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలోను ప‌లుమార్లు మెడ‌లో భారీ పైథాన్ ల‌ను ధ‌రించి ఆట‌లాడుకుంది. గ‌తంలో ఓసారి భారీగా పొడ‌వాటి తెలుపు రంగు కొండ చిలువ‌ను మెడ‌లో వేసుకుని క‌నిపించింది. అంత‌కుముందు కూడా మ‌రో కొండ చిలువ‌తో ఆట‌లాడుకుంటూ క‌నిపించిన పీసీ, ఒక తాచు పామును కూడా ఎంతో ధైర్యంగా ప‌ట్టుకుని కనిపించింది.

ప్ర‌స్తుతం పీసీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. పీసీ ధైర్యాన్ని చూసి మెచ్చుకోని వారే లేరు. త‌న‌ను చూడ‌గానే ఒక మంత్ర‌గ‌త్తె అని కూడా కొంద‌రు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. త‌న భ‌ర్త నిక్ స‌మ‌క్షంలో పీసీ న‌వ్వులు చిందిస్తూ కొండ‌చిలువ‌తో ఎలా ఫోజులిస్తోందో చూస్తున్నారా?

Priyanka Chopra poses with a snake around her Neck:

&nbsp; <p class="MsoNormal">Priyanka Chopra stuns fans by wearing snake as necklace &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs