బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ రెండుగా విడిపోయారు. ఒక్కరు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని బిగ్ బాస్ హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు. భరణి-శ్రీజ లలో ఎవరు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే విషయమై హౌస్ మేట్స్ కొన్ని సూచనలు ఇచ్చారు. మీరు ఇది మార్చుకోవాలి, మీరు ఇది మార్చుకోవాలి అంటూ శ్రీజ, భరణి లకు హౌస్ మేట్స్ స్లేట్ పై రాసారు.
ఇక భరణి రీ ఎంట్రీ ఇచ్చాక దివ్య ని లైట్ తీసుకోవడం, తనూజ తో క్లోజ్ గా ఉండడం అందరికి షాకిచ్చింది. ఫిజికల్ టాస్క్ కోసం ప్రస్తుతం హౌస్ లో భరణి కోసం కొంతమంది, శ్రీజ కోసం కొంతమంది నిలబడగా.. భరణి, శ్రీజ ల కోసం హౌస్ మేట్స్ విడిపిపోయి నానా గొడవ పడుతున్నారు. ఫిజికల్ టాస్క్ సమయంలో భరణి శంకర్ కి తీవ్ర గాయాలపాలవ్వడం, ఆ వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భరణి ప్రాథమిక పరీక్షల్లో ఆయనకు రిబ్స్ దగ్గర గాయాలు, చెస్ట్ నొప్పి, శ్వాస సమస్యలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అయితే భరణి కోలుకుని హౌస్ లోకి వస్తారని అంటున్నారు. ఏది ఏమైనా భరణి-శ్రీజ కోసం హౌస్ మేట్స్ రెండు గ్రూప్ లుగా విడిపోయి రచ్చ చేస్తున్నారు.