సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ లో బిజీగా వున్నారు. కొన్నేళ్లుగా రజినీకాంత్ సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు.. అస్సలు బ్రేక్ తీసుకోవడం లేదు. కానీ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోబోతున్నట్టు వస్తోన్న వార్తలు మీడియా నే కాదు అభిమానులను టెన్షన్ లోకి నెట్టేసింది.
రజినీకాంత్ నుంచి అధికారిక సమాచారం కాకపోయినా సూపర్ స్టార్ రిటైర్ మెంట్ పై వస్తోన్న వార్తలు నిజమే అని కొంతమంది బల్లగుద్ది చెబుతున్న విషయం మాత్రం అందరిని షాక్ కి గురి చేస్తుంది. ఆయన కమిట్ అయిన సినిమాలు ముఖ్యంగా కమల్ తో ఆయన చెయ్యబోయే మల్టీస్టారర్ షూటింగ్స్ ఫినిష్ చేసి ఆతర్వాత సినిమాలకు స్వస్తి చెబుతారు, పూర్తిగా ఆయన విశ్రాంతి తీసుకుంటారంటున్నారు.
గతంలోనూ అంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు రజినీకాంత్ ఆరోగ్యం పాడవడం, ఆతర్వాత రజిని రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తన నుంచి మరో రెండు మూడు సినిమాలే వస్తాయి, ఆతర్వాత ఆరోగ్య రీత్యా రెస్ట్ తీసుకోవడానికి సినిమాలు మానేస్తారనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలపై సూపర్ స్టార్ ఎలా రియాక్టర్ అవుతారో చూడాలి.