మంథా తుఫాను తీవ్రత ఏపీలో బీభత్సం సృష్టిస్తుంది. మంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో, తీర ప్రాంత జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. తుఫాను తీరం దాటే సమయానికి తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులతో చెట్లు పడిపోయి, కరెంట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాద తీవ్రత దృష్ట్యా, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు గత రాత్రి కుండపోత వర్షం, గాలులతో ఏపీ మొత్తం భయానక వాతావరణం తాండవం చేసింది.
ఏపీలో మంథా తుఫాను ప్రభావంతో ఏపీలోని స్కూళ్ల కు సెలవలు పొడిగించారు. ఈనెల 31 వరకు స్కూల్స్ కి సెలవలు పొడిగించింది విద్యాశాఖ, మంథా తుఫాను ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.