గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలు నమ్మిన బీఆర్ఎస్ నేత కేసీఆర్ ను గత ఎన్నికల్లో అస్సలు నమ్మలేదు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అండ్ కో ని తుక్కు తుక్కుగా ఓడించి కాంగ్రెస్ కి ప్రజలు పట్టం కట్టారు. అయితే పల్లెల్లో, పట్టణాల్లో కాంగ్రెస్ కి ఓటేసిన ప్రజలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు.
హైదరాబాద్ ప్రజలంతా బీఆర్ఎస్ ని నమ్మారు, ఓటేశారు, హైదరాబాద్ అభివృద్దే, కేటీఆర్ పై నమ్మకమో తెలియదు కానీ హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ ను నమ్మారు. మరి ఈసారి కూడా కేసీఆర్, బీఆర్ఎస్ వెనుక హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు నిలబడతారా, లేదంటే కాంగ్రెస్ కే దాసోహమంటారా..
మాగంటి గోపినాధ్ అకాలమరణంతో జూబ్లీహిల్స్ కి ఉప ఎన్నికలొచ్చాయి. బీఆర్ఎస్ నుంచి గోపినాధ్ భార్య సునీతని తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్. అటు కాంగ్రెస్ వైపు నుంచి నవీన్ యాదవ్ పోటీపడుతున్నారు. మాగంటి గోపినాధ్ తెలుగు దేశం నుంచి బీఆర్ఎస్ లో చేరడమే కాదు జూబ్లీహిల్స్ ప్రజలకు బాగా దగ్గరైన వ్యక్తి. అయన మరణం పై ఉన్న సింపతీ బీఆర్ఎస్ ను గెలిపిస్తుందా..
లేదంటే రేవంత్ రెడ్డి మ్యానియా కాంగ్రెస్ కి పని చేస్తుందా.. ఏది ఏమైనా నవంబర్ లో జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎంతమంది పోటీపడినా.. ముఖ్యంగా కాంగ్రెస్ vs బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటి కనిపిస్తుంది. చూద్దాం ఈసారి కూడా హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ వెనుక నిలబడతారో, లేదో అనేది.