డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రెండు వారాల ముందు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దమ్ము శ్రీజ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ రివ్యూలు చెప్పేవాళ్ళు, ఆమె అభిమానులు గొంతెత్తి మొత్తుకున్నారు. శ్రీజ కూడా తన ఎలిమినేషన్ విషయంలో ఫీలైంది.
అయితే నిన్న సోమవారం హౌస్ నుంచి సీజన్ 9 లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ను తీసుకొచ్చి వాళ్లలో ఎవరో ఒకరు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారంటూ కొంతమందిని తో హౌస్ మేట్స్ ని నామినేట్ చేయించాడు బిగ్ బాస్. ప్రియా, మనీష్, ఫ్లోరా, శ్రీజ, భరణి హౌస్ లోకి వచ్చారు. శ్రీజ నేరుగా నన్ను డిజప్పాయింట్ చేసావ్ అంటూ కళ్యాణ్ ని నామినెట్ చేసింది. నిన్ను బ్యాక్ బిచ్చింగ్ చేసినవాళ్లను, నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడిన వాళ్ళను నువ్వు క్షమించేసావ్, డిపెండ్ చేసుకోలేకపోయావ్ అంటూ కళ్యాణ్ ని కడిగేసింది.
ఇక శ్రీజ నెక్స్ట్ టార్గెట్ తనూజ. కానీ శ్రీజ ను హౌస్ నుంచి పంపడానికి కారణమైన మాధురికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది. మాధురి రీతూ తో గొడవపడుతూ నామినేట్ చేసిందని. అయినప్పటికి శ్రీజ మధ్యలో తనూజ ను కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయలేదు, అంటే తన మీద చెయ్యి వేయించుకున్నాక నువ్వు నామినేట్ చేస్తే నెగెటివ్ అవుతావని భయపడ్డవా అంటూ, మాధురి గారు మీరు తనూజ కూడా డబ్బులు గురించే మట్లాడుకున్నారు అంటూ మాధురి నామినేషన్స్ లోకి మధ్యలోకి వెళ్లగా నువ్వు ఆగవమ్మా అంటూ మాధురి విసురుగా శ్రీజ ను ఆపింది.
ఇప్పుడు నేను బయటికెళితే నా తల పగలగొడతారేమో.. నన్ను టార్గెట్ చేస్తారు, ఎగరేసి కొడతారేమో అంటూ శ్రీజ మాట్లాడుతూ మధురిని మరింతగా రెచ్చిగొట్టింది. మిగతా వాళ్ళ కన్నా దమ్ము శ్రీజ మాత్రం ఈవారం నామినేషన్స్ లో దుమ్మురేపింది.