సమంత తనపై వస్తున్న రూమర్స్ కి బలాన్నిస్తుంది. కొద్దిరోజులుగా సమంత దర్శకుడు రాజ్ నిడమోరు తో డేటింగ్ లో ఉంది అనే రూమర్స్ వింటున్నాము. వాటికీ బలాన్నిస్తూనే సమంత రాజ్ నిడమోరు తో కలిసి కనిపిస్తుంది. ఆమె నిర్మించిన శుభం చిత్రంలో రాజ్ నిడమోరు కీలకంగా కనిపించారు.
ఆతరవాత రాజ్ నిడమోరు ఫ్యామిలీతో కలిసి సమంత దీపావళి పండుగను సెలెబ్రేట్ చేసుకోవడం మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియాలో సమంత-రాజ్ నిడమోరు రిలేషన్ పై ఎంతగా రచ్చ జరుగుతుందో అంతగా సమంత రాజ్ తో కలిసి కనిపిస్తుంది.
ఇప్పుడు కూడా నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత చేస్తున్న మా ఇంటి బంగారం చిత్రం ఓపెనింగ్ లోనే కాదు ఆ చిత్రం లో రాజ్ నిడమోరు భాగమవుతున్నారు. ఆ విషయాన్ని సమంత అఫీషియల్ గా ప్రకటించేసింది. రాజ్ నిడమోరు ఈ చిత్రానికి వన్ ఆఫ్ ద నిర్మాతే.. అయినా సమంత తో కలిసి పని చెయ్యడం వారిపై వస్తున్న రూమర్స్ కి మరింతగా బలాన్ని చేకూర్చాయి.