సక్సెస్ ఫుల్ కాంబో రిపీట్ అంటూ మాస్ జాతర తో మాస్ రాజా రవితేజ-శ్రీలీల మరొక్కసారి జోడి కట్టి ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31 న పెయిడ్ ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మాస్ జాతర ప్రమోషన్స్ ను నిర్మాత నాగవంశీ, హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల లు ఫుల్ జోష్ లో పరుగులు పెట్టిస్తున్నారు.
ఇప్పటికే రవితేజ-శ్రీలీల డాన్స్ నెంబర్లతో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ ఇప్పుడు మాస్ జాతర ట్రైలర్ తో మరింత క్రేజ్ తీసుకొచ్చారు. ఇంతకుముందే గ్రాండ్ ఈవెంట్ లో మాస్ జాతర ని లాంచ్ చేసారు మేకర్స్. మాస్ జాతర ట్రైలర్లోకి వెళితే.. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ కేరెక్టర్ ను పవర్ ఫుల్ గా చూపించడమే కాదు.. రవితేజ మాస్ ఎనర్జీ మరోసారి మాస్ జతర ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది.
విలన్ నవీన్ చంద్ర లుక్స్, హీరో-విలన్ మధ్యన భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లు, రవితేజ-శ్రీలీల ఊరమాస్ స్టెప్స్, శ్రీలీల ట్రెడిషనల్ లుక్, రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు.
భాను భోగవరపు దర్శకత్వం, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో BGM, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని మాస్ జాతర ట్రైలర్ కి రిచ్ గా అమరాయి.