సూపర్ స్టార్ రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కిన జైలర్ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో నెల్సన్ దిలీప్ కుమార్ దానికి సీక్వెల్ గా జైలర్ 2 ని ఈసారి భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది.
జైలర్ చిత్రంలో పవర్ ఫుల్ స్మగ్లింగ్ గ్యాంగ్ తో సూపర్ స్టార్ రజిని తలపడేందుకు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల హెల్ప్ తీసుకుంటారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ రెండు క్యామియోస్ జైలర్ చిత్రానికి హైలైట్స్. ఇక దానికి సీక్వెల్ అంటే జైలర్2 స్టోరీ వేరే లెవల్లో ఉండాలి. జైలర్ 1 విలనిజం కన్నా మరింత డోస్ ని జైలర్ 2 లో చూపించబోతున్నాడట దర్శకుడు నెల్సన్.
జైలర్ 2లో రజినీకాంత్ ఈసారి ఓ విలన్ ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలిలో మొత్తం అందరూ విలన్స్ అని.. ఆ ఫ్యామిలీతో ఈ జైలర్ గారు యుద్ధం చేస్తారట. దీని కోసం ఈసారి నెల్సన్ గెస్ట్ పాత్రలను మరింత బలంగా రాసుకున్నారట. ఈ విలన్ సామ్రాజ్యానికి హెడ్‌గా బాలీవుడ్ సీనియర్ స్టార్ మిథున్ చక్రవర్తి ని చూపించబోతున్నారనే టాక్ నడుస్తుంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ విద్య బాలన్ పాత్ర జైలర్ 2 లో అందరూ సర్ ప్రైజ్ అయ్యేలా ఉండబోతుంది అని అంటున్నారు. అయితే ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ లో ఉండబోతుందట. విద్యాబాలన్ తాజాగా 2 జైలర్ సెట్ లో జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. మరి ఈలెక్కన సూపర్ స్టార్ రజిని జైలర్ 2 లో లేడీ విలన్ తో తలపడబోతున్నారన్నమాట.