బిగ్ బాస్ సీజన్ 9 50 డేస్ పూర్తి చేసుకుంది. గత కొన్ని వారాలుగా షాకింగ్ కంటెస్టెంట్స్ ఎలిమినెట్ అవుతూ వస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్ లో శ్రీజ, గత వారం భరణి, ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేషన్ ని ఎవ్వరూ ఊహించలేదు. ఇక ఈ వారం నామినేషన్స్ చేసే అవకాశం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కి ఇచ్చాం అంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.
అందులో కామనర్స్ ప్రియా, మనీష్, శ్రీజ లతో పాటుగా సెలెబ్రిటీ ఫ్లోరా షైనీ ని హౌస్ లోకి పంపించారు. రోడ్ రోలర్ లాంటి పదాలు అన్న సంజనపై ప్రియా ఫైర్ అయ్యింది. శ్రీజ కళ్యాణ్ కి షాక్ ఇచ్చింది. ఇమ్మాన్యువల్ ని మోసం చేసావ్ అంటూ కళ్యాణ్ ని మనీష్ ఏసుకున్నాడు. ఈ నామినేషన్స్ లో ఇమ్మాన్యువల్ తనూజ ను నామినేట్ చేసాడు, నాకోసమే ఆడింది కానీ ఓటింగ్‌లో మోసం చేసింది అని ఇమాన్యువల్ అంటే తనూజ రెండు నాలుకలతో మాట్లాడుతున్నావ్ అంటూ ఇమ్ముని అరిచింది.
కళ్యాణ్, రాము మధ్య ఆర్గ్యుమెంట్ నడిచింది. అంతేకాదు మనీష్ తనూజ ను ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారు అంటూ సెటేరికల్ గా మాట్లాడాడు. ఫైనల్ గా ఈవారం నామినేషన్స్ రచ్చ హౌస్ ని హీటెక్కించగా.. ఈ ఎలిమినేట్ అయినవారిలో కొంతమంది హౌస్లోకి వచ్చి టైటిల్ కూడా గెలుస్తారని బిగ్ బాస్ చెప్పగానే మిగతా హౌస్ మేట్స్ షాకయ్యారు.
ఫైనల్ గా ఎనిమిదో వారం నామినేషన్ లిస్ట్ లో దివ్వెల మాధురి ని డైరెక్ట్ గా తనూజ నామినేట్ చెయ్యగా.. రీతూ చౌదరి, సంజన, తనూజ, డీమాన్ పవన్, కళ్యాణ్, గౌరవ్, రాము రాథోడ్ నామినేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.