20 ఏళ్ళ లోపే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరసగా మూడు సినిమాల్తో హ్యాట్రిక్ అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి కి ఆ తర్వాత సక్సెస్ కి బాగా దూరమైపోయింది. తెలుగులో అవకాశాలు లేని ఈ పాప కోలీవుడ్ లోను అదృష్టం వెతుక్కుంటుంది. డిసెంబర్లో అమ్మడు నటించిన మూడు సినిమాలు కోలీవుడ్ లో విడుదల కాబోతున్నాయి.
అందులో ఏ ఒక్క సినిమా హిట్ అయినా చాలు కృతి శెట్టి పేరు కోలీవుడ్ లో మార్మోగిపోతుంది. కార్తీ, ప్రదీప్ రంగనాధన్ ఇలా క్రేజీ హీరోలతో నటించిన కృతి శెట్టి సినిమాలు మూడు బ్యాక్ టు బ్యాక్ ఒకే నెలలో రాబోతున్నాయి. ఇక ట్రెడిషనల్ గర్ల్ గా ఎక్స్పోజ్ అయిన కృతి శెట్టి ఈ మధ్యన గ్లామర్ షో చేస్తుంది.
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అందాలు ఆరబోస్తూ ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తుంది. గ్లామర్ షో తో మెల్లగా టాలీవుడ్ కి గాలం వెయ్యాలని చూస్తుంది. తాజాగాను కృతి శెట్టి నుంచి క్రేజీ బ్యూటిఫుల్ పిక్స్ షేర్ అయ్యాయి. ఆ పిక్స్ లో కృతి శెట్టి క్యూట్ గా కనిపిస్తుంది అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.